నేటి యువతరంలో ఒక నవశకానికి నాంది బోస్ గారు
చిన్ని చిన్ని పదాలు గొప్ప గొప్ప అర్ధాలు ఆయన శైలి
మనం వాడుకు భాషలో ఉపయోగించే పదాలు ఆయన పాటలో వింటే
ఈ పదాలతో ఇంత అర్ధాన్ని ఇవ్వచ్చా అనిపిస్తుంది....
కన్నులు చిన్నగా అనిపించచ్చు కాని చూపు పెద్దది
అడుగులు చిన్నగా కనిపించచ్చుకానీ పయనం పెద్దది
సూర్యుడు చిన్నగా కనిపించచ్చు కానీ వెలుగు గొప్పది
అలాగే బోస్ గారు చిన్నగా అనిపించచ్చు కానీ ఆయన పాటలు గొప్పవి
ఆయన పాట వింటే నీటిలో పడిన అగ్గిపుల్లకి కూడా నిప్పు వచ్చే అంత శక్తి ఉంటుంది
ఆయన మాట వింటే అడుగులు పడని అవిటివాడు కూడా పరిగెత్తగలిగేట్టు ఉంటాయి
ఆయన్ని చూస్తేనే అక్షరం రాని పామరుడికి కూడా కవితలు రాయాలనిపిస్తుంది
చాలామంది చెప్పగా విన్నాను మంచితనానికి మానవత్వానికి ఆయన నిలువెత్తు సాక్షం అని
దేహి అని అర్ధిస్తే ఎవరికైనా లేదనకుండా ఇస్తారని....
...........పవన్
No comments:
Post a Comment