శతకోటి సూర్య చంద్రులు ఏకమై దివి నుండి భువికి దిగి వస్తే
అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉన్నవారికి
శ్రీ శ్రీ పాటని వినిపిస్తే సరిపోతుంది.
వెలుగు నీడల సంగమమైన ఈ జీవితంలో
ఇతరులకి వెలుగును పంచిస్తూ కరిగిపోయిన సాహితీ నిధి శ్రీ శ్రీ....
ఎంతటి నిరాశా నిస్పృహలలో ఉన్నా తన రాతలతో మన తల రాతలు మార్చుకోగల శక్తినిస్తుంది ఆయన సాహిత్యం
సూర్యుడికి నిర్యాణం ఉండదన్నది ఎంత నిజమో
ఈ ప్రపంచం ఉన్నంతవరకు శ్రీ శ్రీ గారు కూడా అమరులు అన్నది కూడా అంతే నిజం....
ఓ మహా కవీ ఈ ఉద్వేగం నీదా.. లేక నీ కలానిదా...
వెన్నెలంటి నీ కవితలతో ఎన్నో కలువలను వికసింప చేసావు
నేను సైతం అంటూ నవశకానికో సమిధనిచ్చి దారి చూపావు..
కారు మబ్బులలో చిక్కుకున్న యువతరానికి మరో ప్రపంచాన్ని ఇచ్చావు
నీవు వాడే ఒక్కో అక్షరం ఒక్కో తూటా..
అదే ముందు తరాలకి వెలుగు బాట
నీ ఒక్కో పదం కదం తొక్కి.. వెలుగు రేఖలు చూపింది
అజ్ఞానపు తిమిరంలో కొట్టుకుపోతున్న భ్రస్టులందరినీ ఒడ్డుకు చేర్చింది
ఓ సాహితి నిధీ యువకులందరికీ నువ్వే పయోనిధి
వివరాలు:
పూర్తి పేరు: శ్రీరంగం శ్రీనివాసరావు
పుట్టిన తేది: 30 ఏప్రిల్ 1910
పుట్టిన స్థలం: విశాఖపట్నం
భార్య పేరు: సరోజ
స్వర్గస్తులైన తేది: 1983
-పవన్
No comments:
Post a Comment