Thursday, 23 June 2011

ఆచార్య ఆత్రేయ

ఆత్రేయ గారు రాయకుండా ప్రొడ్యూసర్లని రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారని  ఒక నానుడి....
ఆ విషయం నాకు సరిగా తెలీదు కాని రాసి మాత్రం  ప్రేక్షకులని బాగా ఏడిపిస్తారు  
నాకు తెలిసినంత వరకు ఆయన ఏ విషయమైన కొట్టినట్టు  చెప్తారు
నాకు ఆయన పాటలు వాటి అర్ధాలు తెలిసే సరికి ఆయన పైలోకానికి చేరుకున్నారు 

ప్రేమనగర్ సినిమాలో ఒక్కో పాట వింటుంటే నిజంగా మనం ఆ పాత్ర లో లీనమై పోయినట్టు అనిపిస్తుంది 
"అంతా మట్టే అని తెలుసు" కాని అలా రాయాలని మాత్రం ఆయనకి మాత్రమే తెలుసు 
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు" అని యవ్వనం లో ఉన్న వారి గురించి ఎంతో అందంగా చెప్పారు....
అయినా యిలా చెప్పుకుంటూ పొతే ఒకటా రెండా కోకొల్లలు.... 

వివరాలు: 
అసలు పేరు: కిలంబి వెంకట నరసింహాచార్యులు
పుట్టిన తేది: 7 may 1921
పుట్టిన స్థలం: మంగళంపాడు
స్వర్గస్థులైన తేది: 13 సెప్టెంబర్ 1989 

శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

సిరివెన్నెల గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
ఆయన పదాల ఎంపిక, వాటి అమరిక లోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది.
ఆయన వాడే ప్రతి అక్షరం అప్పుడే పుట్టిన పాపాయిలా ఎంతో ముద్దుగా ఉంటుంది 
అక్షరం ఆయన కోసమే పుట్టిందా అన్న భావన మనకి కలుగుతుంది.

వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది   
అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది
అలా శాస్త్రి గారిని ఒడిసిపట్టిన ఆల్చిప్ప విశ్వనాధ్ గారు.
కళకి జీవం తోడైంది అదే జీవకళై సిరివెన్నెలగా  మిగిపోయింది.

"మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చేజారా"కా అని ఒక్క మాటలో సూత్రం గొప్పతనం చెప్పినా
"ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు" అని జీవిత పరమార్ధం వడపోసినా 
"ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి  ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి" అని గెలుపు తలుపుకు దారి చూపినా
"పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం" అని విడాకుల చట్టానికి ఎదురేగి తప్పుని ఎత్తి చూపినా 
                                                               అది శాస్త్రి గారికి మాత్రమే చెల్లింది .

వెన్నెల వెలుగును తనలోనే దాచుకోక అందరికీ పంచిస్తూ 
కలకి ఇలకి బేధం చూపి జీవన సత్యం బోధిస్తూ......
అర్ధశతాప్దపు అజ్ఞానాన్నే తరిమేసే ఒక రక్తపు సిందూరమై.... 
వెలిగిపోతున్న మీకు ఇవే మా సహస్రకోటి  వందనాలు....


వివరాలు: 
అసలు పేరు: చెంబోలు సీతారామ శాస్త్రి
పుట్టిన తేది: 20 మే 1955 


కీ.శే. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు

వేటూరి గారి గురించి ఎంత చెప్పిన తక్కువే...
 ఆయన ఒక శక్తి...
 ఆయన ఒక యుక్తి...
 ఆయన ఒక స్పూర్తి...

ఇంటి పేరుని తన పేరుగా మార్చుకుని వంశ గౌరవం నిలబెట్టి తన గొప్పతనాన్ని చాటుకున్న దీక్షాదక్షుడు.
తెలుగుకి ప్రాచీన గౌరవం తేవాలని కాంక్షించి జాతీయ బహుమతి సైతం వద్దంటూ ప్రాచీన గౌరవం తెచ్చిన భగీరధుడు 
ఆయన ఒక్కో పదం ఒక్కో వేదం.. ఒక్కో పలుకు ఒక్కో నాదం... ఆయనే ముందు తరాలకి మార్గం 
ఆయన తన ముందు తరాలకి ఇచ్చిన ఆస్తి ఎంతకీ తరిగిపూని కవితా సంపుటి.

"ఆకాశాన్నాక్రమించిన ఆయన భావనాపాదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషాపాదానికి భక్తితో అంజలి ఘటిస్తూ "నా మూడో పాదాన్ని నీ నెత్తిన పెడతా" అంటున్న ఆయన తాండవ పాదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ" అని సిరివెన్నెల గారిచే అనిపించుకున్న గొప్ప మనీషి వేటూరి.



వివరాలు: 
అసలు పేరు: వేటూరి సుందరరామ మూర్తి 
పుట్టిన తేది: 29 జనవరి 1936
పుట్టిన  స్థలం: పెదకళ్ళేపల్లి , కృష్ణ జిల్లా 
భార్య పేరు: సీతామహాలక్ష్మి 
స్వర్గస్థులైన తేది: 22 మే 2010