సిరివెన్నెల గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
ఆయన పదాల ఎంపిక, వాటి అమరిక లోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది.
ఆయన వాడే ప్రతి అక్షరం అప్పుడే పుట్టిన పాపాయిలా ఎంతో ముద్దుగా ఉంటుంది
అక్షరం ఆయన కోసమే పుట్టిందా అన్న భావన మనకి కలుగుతుంది.
వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది
అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది
అలా శాస్త్రి గారిని ఒడిసిపట్టిన ఆల్చిప్ప విశ్వనాధ్ గారు.
కళకి జీవం తోడైంది అదే జీవకళై సిరివెన్నెలగా మిగిపోయింది.
"మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చేజారా"కా అని ఒక్క మాటలో సూత్రం గొప్పతనం చెప్పినా
"ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు" అని జీవిత పరమార్ధం వడపోసినా
"ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి" అని గెలుపు తలుపుకు దారి చూపినా
"పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం" అని విడాకుల చట్టానికి ఎదురేగి తప్పుని ఎత్తి చూపినా
అది శాస్త్రి గారికి మాత్రమే చెల్లింది .
వెన్నెల వెలుగును తనలోనే దాచుకోక అందరికీ పంచిస్తూ
కలకి ఇలకి బేధం చూపి జీవన సత్యం బోధిస్తూ......
అర్ధశతాప్దపు అజ్ఞానాన్నే తరిమేసే ఒక రక్తపు సిందూరమై....
వెలిగిపోతున్న మీకు ఇవే మా సహస్రకోటి వందనాలు....
వివరాలు:
అసలు పేరు: చెంబోలు సీతారామ శాస్త్రి
పుట్టిన తేది: 20 మే 1955
No comments:
Post a Comment