Thursday, 4 August 2011

చంద్రబోస్


నేటి యువతరంలో ఒక నవశకానికి నాంది బోస్ గారు
చిన్ని చిన్ని పదాలు గొప్ప గొప్ప అర్ధాలు ఆయన శైలి
మనం వాడుకు భాషలో ఉపయోగించే పదాలు ఆయన పాటలో వింటే
ఈ పదాలతో ఇంత అర్ధాన్ని ఇవ్వచ్చా అనిపిస్తుంది.... 

కన్నులు చిన్నగా అనిపించచ్చు కాని చూపు పెద్దది
అడుగులు చిన్నగా కనిపించచ్చుకానీ పయనం పెద్దది
సూర్యుడు చిన్నగా కనిపించచ్చు కానీ వెలుగు గొప్పది
అలాగే బోస్ గారు చిన్నగా అనిపించచ్చు కానీ ఆయన పాటలు గొప్పవి


ఆయన పాట వింటే నీటిలో పడిన అగ్గిపుల్లకి కూడా నిప్పు వచ్చే అంత శక్తి ఉంటుంది
ఆయన మాట వింటే అడుగులు పడని అవిటివాడు కూడా పరిగెత్తగలిగేట్టు ఉంటాయి 
ఆయన్ని చూస్తేనే అక్షరం రాని పామరుడికి కూడా కవితలు రాయాలనిపిస్తుంది

చాలామంది చెప్పగా విన్నాను మంచితనానికి మానవత్వానికి ఆయన నిలువెత్తు సాక్షం అని
                   దేహి అని అర్ధిస్తే ఎవరికైనా లేదనకుండా ఇస్తారని....

                                                                           ...........పవన్ 

Tuesday, 19 July 2011

మహా కవి శ్రీ శ్రీ

         శతకోటి సూర్య చంద్రులు ఏకమై దివి నుండి భువికి దిగి వస్తే
అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉన్నవారికి
శ్రీ శ్రీ పాటని వినిపిస్తే సరిపోతుంది. 
వెలుగు నీడల సంగమమైన ఈ జీవితంలో 
ఇతరులకి వెలుగును పంచిస్తూ కరిగిపోయిన సాహితీ నిధి శ్రీ శ్రీ....
ఎంతటి నిరాశా నిస్పృహలలో ఉన్నా తన రాతలతో మన తల రాతలు మార్చుకోగల శక్తినిస్తుంది  ఆయన సాహిత్యం 
సూర్యుడికి నిర్యాణం ఉండదన్నది ఎంత నిజమో 
ఈ ప్రపంచం ఉన్నంతవరకు శ్రీ శ్రీ గారు కూడా అమరులు అన్నది  కూడా అంతే నిజం....

ఓ మహా కవీ ఈ ఉద్వేగం నీదా.. లేక నీ కలానిదా...
వెన్నెలంటి నీ కవితలతో ఎన్నో కలువలను వికసింప చేసావు  
నేను సైతం అంటూ నవశకానికో సమిధనిచ్చి దారి చూపావు..
కారు మబ్బులలో చిక్కుకున్న యువతరానికి మరో ప్రపంచాన్ని ఇచ్చావు
నీవు వాడే ఒక్కో అక్షరం ఒక్కో తూటా.. 
అదే ముందు తరాలకి వెలుగు బాట 

నీ ఒక్కో పదం కదం తొక్కి.. వెలుగు రేఖలు చూపింది
అజ్ఞానపు తిమిరంలో కొట్టుకుపోతున్న భ్రస్టులందరినీ ఒడ్డుకు చేర్చింది 
ఓ సాహితి నిధీ యువకులందరికీ నువ్వే పయోనిధి

వివరాలు:
పూర్తి పేరు: శ్రీరంగం శ్రీనివాసరావు
పుట్టిన తేది: 30 ఏప్రిల్ 1910
పుట్టిన స్థలం: విశాఖపట్నం    
భార్య పేరు: సరోజ
స్వర్గస్తులైన తేది: 1983

                                                                               -పవన్

Thursday, 23 June 2011

ఆచార్య ఆత్రేయ

ఆత్రేయ గారు రాయకుండా ప్రొడ్యూసర్లని రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారని  ఒక నానుడి....
ఆ విషయం నాకు సరిగా తెలీదు కాని రాసి మాత్రం  ప్రేక్షకులని బాగా ఏడిపిస్తారు  
నాకు తెలిసినంత వరకు ఆయన ఏ విషయమైన కొట్టినట్టు  చెప్తారు
నాకు ఆయన పాటలు వాటి అర్ధాలు తెలిసే సరికి ఆయన పైలోకానికి చేరుకున్నారు 

ప్రేమనగర్ సినిమాలో ఒక్కో పాట వింటుంటే నిజంగా మనం ఆ పాత్ర లో లీనమై పోయినట్టు అనిపిస్తుంది 
"అంతా మట్టే అని తెలుసు" కాని అలా రాయాలని మాత్రం ఆయనకి మాత్రమే తెలుసు 
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు" అని యవ్వనం లో ఉన్న వారి గురించి ఎంతో అందంగా చెప్పారు....
అయినా యిలా చెప్పుకుంటూ పొతే ఒకటా రెండా కోకొల్లలు.... 

వివరాలు: 
అసలు పేరు: కిలంబి వెంకట నరసింహాచార్యులు
పుట్టిన తేది: 7 may 1921
పుట్టిన స్థలం: మంగళంపాడు
స్వర్గస్థులైన తేది: 13 సెప్టెంబర్ 1989 

శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

సిరివెన్నెల గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
ఆయన పదాల ఎంపిక, వాటి అమరిక లోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది.
ఆయన వాడే ప్రతి అక్షరం అప్పుడే పుట్టిన పాపాయిలా ఎంతో ముద్దుగా ఉంటుంది 
అక్షరం ఆయన కోసమే పుట్టిందా అన్న భావన మనకి కలుగుతుంది.

వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది   
అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది
అలా శాస్త్రి గారిని ఒడిసిపట్టిన ఆల్చిప్ప విశ్వనాధ్ గారు.
కళకి జీవం తోడైంది అదే జీవకళై సిరివెన్నెలగా  మిగిపోయింది.

"మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చేజారా"కా అని ఒక్క మాటలో సూత్రం గొప్పతనం చెప్పినా
"ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు" అని జీవిత పరమార్ధం వడపోసినా 
"ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి  ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి" అని గెలుపు తలుపుకు దారి చూపినా
"పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం" అని విడాకుల చట్టానికి ఎదురేగి తప్పుని ఎత్తి చూపినా 
                                                               అది శాస్త్రి గారికి మాత్రమే చెల్లింది .

వెన్నెల వెలుగును తనలోనే దాచుకోక అందరికీ పంచిస్తూ 
కలకి ఇలకి బేధం చూపి జీవన సత్యం బోధిస్తూ......
అర్ధశతాప్దపు అజ్ఞానాన్నే తరిమేసే ఒక రక్తపు సిందూరమై.... 
వెలిగిపోతున్న మీకు ఇవే మా సహస్రకోటి  వందనాలు....


వివరాలు: 
అసలు పేరు: చెంబోలు సీతారామ శాస్త్రి
పుట్టిన తేది: 20 మే 1955 


కీ.శే. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు

వేటూరి గారి గురించి ఎంత చెప్పిన తక్కువే...
 ఆయన ఒక శక్తి...
 ఆయన ఒక యుక్తి...
 ఆయన ఒక స్పూర్తి...

ఇంటి పేరుని తన పేరుగా మార్చుకుని వంశ గౌరవం నిలబెట్టి తన గొప్పతనాన్ని చాటుకున్న దీక్షాదక్షుడు.
తెలుగుకి ప్రాచీన గౌరవం తేవాలని కాంక్షించి జాతీయ బహుమతి సైతం వద్దంటూ ప్రాచీన గౌరవం తెచ్చిన భగీరధుడు 
ఆయన ఒక్కో పదం ఒక్కో వేదం.. ఒక్కో పలుకు ఒక్కో నాదం... ఆయనే ముందు తరాలకి మార్గం 
ఆయన తన ముందు తరాలకి ఇచ్చిన ఆస్తి ఎంతకీ తరిగిపూని కవితా సంపుటి.

"ఆకాశాన్నాక్రమించిన ఆయన భావనాపాదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషాపాదానికి భక్తితో అంజలి ఘటిస్తూ "నా మూడో పాదాన్ని నీ నెత్తిన పెడతా" అంటున్న ఆయన తాండవ పాదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ" అని సిరివెన్నెల గారిచే అనిపించుకున్న గొప్ప మనీషి వేటూరి.



వివరాలు: 
అసలు పేరు: వేటూరి సుందరరామ మూర్తి 
పుట్టిన తేది: 29 జనవరి 1936
పుట్టిన  స్థలం: పెదకళ్ళేపల్లి , కృష్ణ జిల్లా 
భార్య పేరు: సీతామహాలక్ష్మి 
స్వర్గస్థులైన తేది: 22 మే 2010